రేపటి నుంచి హైదరాబాద్‌లో ఏరోమార్ట్ సదస్సు

హైదరాబాద్‌లో ఈ నెల 30 నుంచి జులై 2 వరకు మూడు రోజుల పాటు 'ఏరోమార్ట్ హైదరాబాద్ 2026' సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు 25 దేశాల నుంచి 400కుపైగా కంపెనీలు, 1200 మందికిపైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. విమానయానం, రక్షణ రంగాలకు చెందిన కంపెనీలు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని బీసీఐ ఏరోస్పేస్‌, తెలంగాణ ప్రభుత్వం కలిసి నిర్వహిస్తున్నాయి. దీని ద్వారా భారత్‌లోని ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్