మధ్యప్రదేశ్‌లోని రేవాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అధ్యాత్మిక ప్రచారకుడిగా గుర్తింపు పొందిన భాస్కరాచార్య .. చత్తీస్ గఢ్ రాయ్ పూర్ ఒక వివాహితతో కారులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీంతో వివాహిత భర్త అనిల్ గుప్తాకు వీరిపై అనుమానం వచ్చి.. ఇద్దరిని పట్టుకోవాలని ప్లాన్ చేసి భార్యను పట్టుకున్నాడు. అనంతరం స్థానికులతో కలిసి ప్రవచనకర్తపై దాడి చేశాడు. జుట్టు కత్తిరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.