ఎఫైర్.. భార్యను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో హోలీ పండుగ రోజున దారుణం చోటుచేసుకుంది. భర్త మన్మోహన్, తన భార్య ఆర్తిని నమ్మకద్రోహానికి పాల్పడిందని ఆరోపిస్తూ కత్తితో దారుణంగా హత్య చేశాడు. ఆర్తి ఆరు నెలలుగా ప్రియుడు బ్రజ్‌దీప్‌తో సహజీవనం చేస్తోంది. ఆర్తి గేటు తెరవగానే, మన్మోహన్ ఆమెపై కత్తితో దాడి చేసి రక్తంతో తడిపాడు. ఆమెను రక్షించడానికి వచ్చిన ప్రియుడు బ్రజ్‌దీప్‌పై యాసిడ్ పోశాడు. ఈ దాడిలో భర్త మన్మోహన్ కూడా గాయపడ్డాడు. పోలీసులు ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్పించారు.

సంబంధిత పోస్ట్