ఎఫైర్.. మహిళను కత్తితో పొడిచి చంపేశాడు

AP: తిరుపతి జిల్లా నాగలాపురం సమీపంలోని కారణి గ్రామానికి చెందిన మణిమేఘలై (28) తమిళనాడులో హత్యకు గురైంది. పదేళ్ల క్రితం రాజేశ్‌తో వివాహమైన ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఉద్యోగం చేస్తున్న క్రమంలో దుర్గాప్రసాద్‌తో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇటీవల ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో ఆగ్రహించిన దుర్గాప్రసాద్‌.. పూండి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో హత్య చేశాడు. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించడంతో కోర్టులో హాజరుపరిచి పుళల్‌ జైలుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕