యూపీలోని బులంద్హర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముబీన్ అనే వ్యక్తి తన 50 ఏళ్ల తండ్రిని, 21 ఏళ్ల భార్యను పిస్టోల్తో కాల్చి చంపాడు. వారిద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని తెలుసుకున్న ముబీన్, వారి వాట్సాప్ మెసేజ్‌లను చదివి మరింత ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇటీవల వారిని అభ్యంతరకర స్థితిలో చూసి తట్టుకోలేక తుపాకీతో తండ్రిని, భార్యను కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు.