ఎఫైర్.. భర్తను హతమార్చిన భార్య

TG: భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పెండల సంపత్ (32) అనే వ్యక్తిని, అతని భార్య సుమలత, ఆమె ప్రియుడు ఉమ్మల శ్రీకాంత్ కలిసి హత్య చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని సంపత్‌ను చంపాలని సుమలత నిర్ణయించుకుంది. ఈ నెల 17న శ్రీకాంత్, తరుణ్ అనే వ్యక్తి సహకారంతో సంపత్‌ను మద్యం తాగేందుకు పిలిచి, పురుగుల మందు కలిపిన మద్యం తాగించి చంపారు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే, మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕