TG: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసిన ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది. పట్టణంలోని గణేశనగర్ లో నివాసముంటున్న కురుమూర్తి, నాగమణి భార్యభర్తలు. అక్టోబరు 25 నుంచి కురుమూర్తి కనిపించడం లేదని ఆయన సోదరి చెన్నమ్మ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. నాగమణి, ఆమె ప్రియుడు శ్రీకాంత్ తో కలిసి కురుమూర్తిని హత్య చేశారని, అనంతరం ఓ కారు అద్దెకు తీసుకొని మృతదేహాన్ని శ్రీశైలం డ్యాంలో పడేసినట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.