ఎఫైర్… ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. రూపేంద్ర సింగ్ చౌహాన్‌, అన్షు భార్యాభర్తలు. రూపేంద్ర సింగ్ స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అన్షు నవనీత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ బంధానికి భర్త రూపేంద్ర అడ్డుగా ఉన్నాడని భావించి నిద్రపోతున్నప్పుడు ప్రియుడితో కలిసి చంపేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి ప్రియుడు నవనీత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రూపేంద్ర భార్య అన్షు పరారీలో ఉంది.

సంబంధిత పోస్ట్