ఎఫైర్.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ

AP: ఎన్టీఆర్ జిల్లాలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది. బాణావతు తండాకు చెందిన వడిత్య రాజేష్, అలేఖ్య దంపతుల్లో, అలేఖ్యకు కృష్ణసేన అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త రాజేష్‌ను హత్య చేయాలని కృష్ణసేన, అలేఖ్యలు పథకం రచించారు. ఈ నెల 21న రాజేష్‌ను మద్యం తాగించి, ఐరన్ రాడ్‌తో కొట్టి, దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కారులో ఎన్ఎస్సీ కాలువలో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు.

సంబంధిత పోస్ట్