పాకిస్థాన్‌లోని ISIS-K (ఖొరాసన్) స్థావరాలపై అఫ్గానిస్థాన్ తాలిబన్ దళాలు వైమానిక దాడులు నిర్వహించాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌పై డ్రోన్లతో జరిగిన ఈ దాడుల్లో పలువురు ISIS నేతలు హతమైనట్లు అఫ్గాన్ ప్రకటించింది. గత ఆదివారం తమ దేశంపై పాక్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు తాలిబన్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, అఫ్గాన్‌పై పాక్ దాడులను భారత్ కూడా తీవ్రంగా ఖండించింది.