ఆఫ్గనిస్థాన్ రక్షణ మంత్రి మౌలవీ మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ భారత్ వల్లే పాకిస్థాన్‌తో వైరం ఏర్పడిందని వచ్చిన ఆరోపణలను నిరాధారమని చెప్పారు. కాబూల్ తన విదేశీ సంబంధాలను స్వతంత్య్రంగా కొనసాగిస్తుందని, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఆఫ్గనిస్థాన్ ఇతర దేశాలకు వ్యతిరేకంగా పనిచేయదని, పొరుగుదేశం పాకిస్థాన్‌తో మంచి సంబంధాలు ఏర్పరచడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.