ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడో, చివరి టీ20 ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచిన టీమ్ ఇండియా సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ చూస్తుండగా.. కనీసం ఒక్క మ్యాచ్లోనైనా విజయం సాధించాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది.