టీడీపీ నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు పేరుతో ఏఐ టెక్నాలజీ ద్వారా మోసం చేస్తున్న భార్గవ్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సైబర్ నేరగాడు చంద్రబాబు, దేవినేని ఉమా పేర్లను ఉపయోగించి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. తూర్పు గోదావరి జిల్లా వెంకన్నగూడెంకు చెందిన భార్గవ్‌ను గుర్తించారు. భార్గవ్ మోసాలకు పాల్పడుతూ గత ఏడాది నుండి తమ వద్దకు రాలేదని అతని తల్లిదండ్రులు తెలిపారు. బీటెక్ పూర్తి చేసిన భార్గవ్‌పై గతంలో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.