100 ఏళ్లయినా ప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదు: బిల్‌గేట్స్‌

AIపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 100 ఏళ్లు అయినా ప్రోగ్రామర్లను ఏఐ పూర్తిగా భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. కోడింగ్‌లో సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని, అలాంటి మానవ మేధా లక్షణాలు ఏఐలో లేవన్నారు. డీబగ్గింగ్‌ వంటి పనుల్లో అసిస్టెంట్‌గా ఉపయోగపడినా, ప్రోగ్రామింగ్‌లో నిర్ణయాలు, ఊహాత్మకత, అనుభవాన్ని ఏఐ భర్తీ చేయలేదని చెప్పారు.

సంబంధిత పోస్ట్