భారతీయ వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విడివిడిగా ఉన్న వ్యవసాయ పరిశోధనలు, డేటాను ఏకీకృతం చేస్తూ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా రైతులకు నేరుగా సలహాలు అందించేలా ‘భారత్-విస్తార్’ అనే సరికొత్త డిజిటల్ వ్యవస్థను రూపొందించింది. అగ్రిస్టాక్ పోర్టల్స్, ఐకార్ ప్యాకేజీలను ఏఐ సిస్టమ్‌లతో అనుసంధానించడం ద్వారా సాగును మరింత లాభసాటిగా మార్చడమే దీని లక్ష్యం. ఈ వ్యవస్థ ద్వారా రైతులకు నిర్దిష్ట శాస్త్రీయ సలహాలు, కరువు, తెగుళ్ల దాడుల గురించి ముందస్తు హెచ్చరికలు అందుతాయి.