వివిధ రంగాల్లో ఇప్పటికే అద్భుతాలు సృష్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు వ్యవసాయ రంగంలోనూ విస్తరిస్తోంది. ఈజిప్ట్‌లోని Egrobots కంపెనీ దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి స్మార్ట్ హార్వెస్టింగ్ రోబోట్‌ను విడుదల చేసింది. కంప్యూటర్ విజన్ టెక్నాలజీతో పనిచేసే ఈ రోబో, పండిన పంటలను గుర్తించి, స్వయంచాలకంగా కదులుతూ సమర్థవంతంగా కోతలు కోయగలదు. ఇది వ్యవసాయంలో మానవ శ్రమను తగ్గించి, సామర్థ్యాన్ని పెంచే దిశగా ఒక ముందడుగు.