బ్రెస్ట్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోంది. స్వీడన్‌లోని ల్యూండ్ యూనివర్సిటీ పరిశోధకులు, ఇతర యూరోపియన్ సంస్థల సహకారంతో లక్షా 6 వేల మంది మహిళలపై జరిపిన అధ్యయనంలో, ఏఐతో మామోగ్రామ్ రిపోర్టులను పరిశీలించడం వల్ల స్క్రీనింగ్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే మహిళల సంఖ్య 12 శాతం తగ్గినట్లు తేలింది. రేడియాలజిస్టులతో పోలిస్తే, ఏఐ భవిష్యత్తులో వచ్చే క్యాన్సర్లను గుర్తించడంలోనూ మెరుగ్గా పనిచేసిందని, 81 శాతం క్యాన్సర్లను గుర్తించగలిగిందని పరిశోధనలో వెల్లడైంది.