సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వ్యవస్థపై, జవాబు పత్రాలు మారిపోయాయనే ఆరోపణలపై కేంద్రం ఐఐటీ కాన్పుర్, ఐఐటీ మద్రాస్ నిపుణులతో ఉన్నతస్థాయి ప్యానెల్‌ను నియమించింది. ఈ ప్యానెల్ సీబీఎస్‌ఈ, ఓఎస్‌ఎం పోర్టల్స్‌లో బలహీనతలు గుర్తించి, క్లాడ్ టూల్స్ ద్వారా చొరబాటు జరిగినట్లు కనుగొంది. ఓఎస్‌ఎంను నిర్వహిస్తున్న కోఎంప్ట్ ఎడ్యుటెక్ సంస్థకు పోర్టల్‌ను సురక్షితంగా ఉంచే నైపుణ్యం లేదని గుర్తించారు. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఓఎస్‌ఎం డేటాను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియాకు తరలించింది. నిపుణుల బృందం ప్రయత్నాలతో సీబీఎస్‌ఈ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ పోర్టల్ తిరిగి లైవ్‌లోకి వచ్చింది.