AI సాయంతో వినియోగదారుల షాపింగ్ అనుభవాన్ని మార్చేసే భారీ అప్‌డేట్‌ను విడుదల చేసింది. మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ (MCP) అనే సరికొత్త ఓపెన్ సోర్స్ సాంకేతికతపై స్విగ్గీ తన ఇన్‌స్టామార్ట్ సేవలను అనుసంధానించింది. దీనివల్ల చాట్ జీపీటీ, క్లాడ్, జెమిని వంటి AI టూల్స్ నేరుగా స్విగ్గీ సర్వర్లతో అనుసంధానమవుతాయి. వినియోగదారులు తమ AI అసిస్టెంట్‌కు ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఆహారం, కిరాణా సామాగ్రి ఆర్డర్ చేయవచ్చు, డైట్ ప్లాన్‌కు తగిన ఆహారాన్ని ఎంచుకోవచ్చు, రెస్టారెంట్లలో టేబుల్స్ బుక్ చేసుకోవచ్చు.