మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దులో దారుణ ఘటన చోటుచేసుకుంది. దీపావళి పండుగకు ఇంటికి వచ్చిన ఇండిగో ఎయిర్ హోస్టెస్ హత్యకు గురయ్యారు. బోండ్రానీ దగ్గర వైన్‌గంగా నదీ తీరాన ఎయిర్ హోస్టెస్ వర్ష తుర్కర్(35)ను దుండగుడు హత్య చేశాడు. స్నేహితుడు రితేష్ అగర్వాల్‌తో కలిసి నదీ తీరానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.