ఖతర్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడులు జరిపిన నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని గల్ఫ్ ప్రాంతాలకు ఎయిర్ ఇండియా తన విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాక తమ సేవలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.