విషాదం వేళ ‘ఆఫీస్ పార్టీ’.. ఎయిరిండియా ఉద్యోగులపై వేటు (వీడియో)

అహ్మదాబాద్‌లోని ఎయిరిండియా విమానం కూలిపోయిన దుర్ఘటన యావత్ ప్రపంచాన్ని కలచివేసింది. ఈ ఘటన నుంచి తేరుకోక ముందే ఎయిరిండియా గ్రౌండ్ సేవల సిబ్బంది ఆఫీసులో పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది. దీంతో చర్యలకు దిగిన సదరు సంస్థ.. నలుగురు సీనియర్ ఉద్యోగులపై వేటు వేసినట్లు పేర్కొంది. ‘ ఆఫీసులో చేసుకున్న ఈ వ్యవహారానికి చింతిస్తున్నాం. బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని తెలిపింది.

సంబంధిత పోస్ట్