3 గంటలు గాల్లో తిరిగి.. వెనక్కి వచ్చేసిన ఎయిరిండియా విమానం

లండన్‌ వెళ్లాల్సిన ఓ ఎయిరిండియా విమానం కొన్ని గంటలకే వెనక్కి వచ్చేసింది. ఫ్లయిట్‌రాడార్‌ 24 డేటా ప్రకారం.. ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5.39 గంటలకు ఎయిరిండియా ఏఐసీ129 విమానం లండన్‌ బయల్దేరింది. మూడు గంటల పాటు గాల్లో ఉన్న ఆ విమానం తిరిగి ముంబయికి చేరుకుంది. విమానాన్ని మళ్లించడానికి గల కారణాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్