టికెట్ల ధరల పరిమితిపై ఎయిర్ ఇండియా చర్యలు

పౌర విమానయాన శాఖ మార్గదర్శకాల ప్రకారం టికెట్ల ధరలపై పరిమితి విధించనున్నట్లు 'X' వేదికగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఎకానమీ క్లాస్ టికెట్ల ధరలపై పరిమితి విధించనున్నారు. దీన్ని మరికొన్ని గంటల్లోనే అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం దృష్ట్యా డిసెంబర్ 6న విమాన టికెట్ల ధరలను పౌర విమానయాన శాఖ క్రమబద్ధీకరించింది. ఈమేరకు ఆయా ఎయిర్‌లైన్స్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్