భారత్‌లో 13% మంది చిన్నారులు నెలలు నిండకుండా, 17% తక్కువ బరువుతో జన్మిస్తున్నారని ఓ సర్వే వెల్లడించింది. దీనికి వాయు కాలుష్యం, ముఖ్యంగా PM 2.5 ధూళికణాలు కారణమని పరిశోధకులు గుర్తించారు. గర్భిణులు పీఎం 2.5 ధూళికణాలను ఎక్కువగా పీల్చడం వల్ల పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశాలు 40 శాతం ఉన్నట్లు తేలింది. ఇంకా నెలలు నిండక ముందే జన్మించే ముప్పు 70 శాతం ఉన్నట్లు వెల్లడైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.