వేసవిలో పెరుగుతున్న వేడిగాలులు, గాలి కాలుష్యం వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలిలో ఉండే దుమ్ము, ధూళి, కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల్లోకి చేరి అలర్జీలు, ఆస్తమా, సీఓపీడీ, గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా పిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, వంటగదిలో సరైన వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవడం, ప్రాణాయామం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.