VIDEO: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్య‌త‌

దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణించింది. ప్రస్తుతం ఏక్యూఐ 129గా ఉంది. గడిచిన నాలుగు సెప్టెంబర్‌లతో పోలిస్తే ఈ సెప్టెంబర్‌లో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంది. పంట వ్యర్థాల దహనం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో ఏడేసి చోట్ల, మధ్యప్రదేశ్‌లో నాలుగు, హర్యానాలో ఒకటి పంట వ్యర్థాలను కాల్చారు. సెప్టెంబర్ 15 నుండి 30 మధ్య ఆరు రాష్ట్రాలలో మొత్తం 114 పంట వ్యర్థాలను కాల్చిన ఘటనలను అధికారులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్

✕
✕