పాకిస్తాన్ జరిపిన దాడులకు ప్రతికారంగా, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ఫోర్సెస్ మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ పై వైమానిక దాడులు చేశాయి. ఖైబర్ పంఖ్తుఖ్వా, బలూచిస్తాన్‌లోని ఐఎస్ఐఎస్ - K స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురు ఐఎస్ఐఎస్ నేతలు మృతి చెందినట్లు ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరించింది.