ఎయిర్‌లైన్స్ లోపాలను వెంటనే సరిదిద్దాలి: రామ్మోహన్ నాయుడు

ఎయిర్‌లైన్స్ లోపాలను వెంటనే సరిదిద్దాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. 'ఇండిగో' కార్యకలాపాల్లో అంతరాయం వల్ల నెలకొన్న పరిస్థితులను విమానయాన శాఖ, DGCA నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. సోమవారం రాత్రి సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఎయిర్‌లైన్స్ పనితీరు, అందిస్తున్న సేవలను తెలుసుకునేందుకు ఎయిర్‌పోర్టులను సందర్శించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్