మయన్మార్‌లోని సాగైంగ్ ప్రాంతంలోని లింటాలు గ్రామంలోని బౌద్ధ ఆరామంపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 23 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.