ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్ తొలగింపు

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. రూ.299 రీఛార్జ్ ప్లాన్‌ను తొలగించింది. దీని స్థానంలో రూ.349 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ అపరిమిత లోకల్, STD కాల్స్, రోజుకు 2GB డేటా, 100 ఉచిత SMS, ఆరు నెలల ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, 12 నెలల అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. రూ.579, రూ.619 ప్లాన్‌లను కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్