ఏప్రిల్‌లో భారతీ ఎయిర్‌టెల్ 34.82 లక్షల కొత్త చందాదారులను ఆకర్షించి, టెలికాం రంగంలో అగ్రస్థానంలో నిలిచింది. ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇదే నెలలో రిలయన్స్ జియో 30.84 లక్షల కొత్త కస్టమర్లతో రెండో స్థానంలో నిలిచింది. మొత్తం టెలికాం చందాదారులు 69.5 లక్షలు పెరిగి 133.75 కోట్లకు చేరారు. వొడాఫోన్ ఐడియా 53,257 మందిని, బీఎస్‌ఎన్‌ఎల్ 76,175 మందిని చేర్చుకున్నాయి. మొత్తం మీద 52.69 కోట్ల చందాదారులతో జియో పరిశ్రమలో నంబర్-1గా ఉంది.