భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన 'స్పేస్‌ఎక్స్'తో ఎయిర్‌టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్‌టెల్ ద్వారా మస్క్ స్టార్‌లింక్ ఇండియాకు తీసుకురానున్నట్లు సమాచారం. వ్యాపారాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, మారుమూల ప్రాంతాలకు స్టార్‌లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను స్పేస్‌ఎక్స్-ఎయిర్‌టెల్ అందించనున్నాయి.