మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్‌కు సంబంధించిన మరో సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. ఈ ఫుటేజీలో విమానం కూలిపోవడానికి ముందు గాల్లోనే తిరగబడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వెంటనే అది నేలకూలింది. ఈ ప్రమాదానికి రన్ వే సరిగా కనిపించకపోవడమే కారణమని DGCA, ఏవియేషన్ నిపుణులు పేర్కొన్నారు.