పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుపుపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా సెటైర్లు వేశారు. ఆస్ట్రేలియా 'బీ టీమ్'పై గెలవడంలో గొప్పేమీ లేదని, కీలక ఆటగాళ్లు లేని జట్టుపై 22 పరుగుల తేడాతో గెలవడం దేశానికి గర్వకారణం కాదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీంలోని కీలక ఆటగాళ్లు ఈ సిరీస్ ఆడటం లేదని, ట్రావిస్ హెడ్ నేతృత్వంలో ఆసీస్ బీ టీమ్ పాక్‌లో ఆడుతోందని చోప్రా పేర్కొన్నారు.