నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుండగా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఈ మూవీ ప్రీమియర్ షోలు రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల రద్దు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.