‘అఖండ 2: తాండవం’ ప్రీమియర్ షోలతో బాలయ్య–బోయపాటి కాంబో మరోసారి థియేటర్లలో సందడి చేసింది. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముందుగా ప్రదర్శించిన స్పెషల్ షోలుకు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. తొలి భాగం ముగిసిన చోట నుంచే కథ మొదలై, అఘోరా–మురళీకృష్ణ ద్విపాత్రాభినయంలో బాలయ్య స్క్రీన్‌ప్రెజెన్స్ అదిరిపోయిందని నెట్‌జన్లు అంటున్నారు. 2 గంటల 45 నిమిషాల రన్ టైంతో వచ్చిన ఈ చిత్రానికి థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్‌లు మాస్ ఫుల్‌గా ఉన్నాయని ట్విట్టర్‌లో రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి.