అఖిల్ అక్కినేని 'లెనిన్' జూన్ 26న విడుదల

యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న 'లెనిన్' చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్స్ కథానాయికగా నటిస్తున్నారు. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 26న విడుదల కానుంది. ఈ చిత్రం భావోద్వేగాలు, ఆకట్టుకునే కథనంతో కూడిన సినిమాటిక్ ప్యాకేజీగా రూపొందుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్