అక్కినేని అఖిల్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘లెనిన్’ చిత్రం జూలై 10న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, చిత్ర యూనిట్ అధికారికంగా ‘లెనిన్’ ట్రైలర్‌ను జూన్ 30న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యం, కుటుంబ భావోద్వేగాలు, పవర్‌ఫుల్ యాక్షన్‌తో రూపొందుతోంది. అఖిల్ సరికొత్త రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అఖిల్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.