ప్రతి ఏటా వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయకు భారతీయుల జీవితాల్లో ప్రత్యేక స్థానం ఉంది. కొత్త వ్యాపారాలు, వివాహాలు, ముఖ్యంగా బంగారం కొనడానికి ఈ రోజును పవిత్రంగా భావిస్తారు. 2026లో కుంభరాశిలో శని-బుధుల కలయికతో అరుదైన యోగం ఏర్పడనుంది. దీనివల్ల మిథున, కన్యా, తులా, ధనుస్సు, మకర, కుంభ రాశుల వారికి ఆర్థికంగా బలోపేతం కావడానికి, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి మార్గం సుగమం కానుంది. గ్రహాల అనుకూలత, అక్షయ తృతీయ శుభ ఘడియలు కలిసి బంగారం కొనుగోలుదారులకు ఈ ఏడాది పండుగలా మారనుంది.