2023 మరియు 2024లో గ్రాస్ కోర్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న కార్లోస్ అల్కరాజ్ వరుసగా మూడోసరి వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన వింబుల్డన్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అల్కరాజ్ 6-4, 5-7, 6-3, 7-6 (6) తేడాతో టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగే ఫైనల్‌లో వరల్డ్ నంబర్ 1 ప్లేయర్ జానిక్ సిన్నర్ లేదా 24 సార్లు మేజర్ ఛాంపియన్ అయిన నోవాక్ జకోవిచ్‌లతో తలపడనున్నాడు.