ALERT: పెద్దల్లో ADHD సమస్య

పెద్దల్లో కూడా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD) కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.  జాతీయ ఆర్థిక సర్వే ప్రకారం, డిజిటల్ వ్యసనం, అధిక స్క్రీన్ టైమ్, మానసిక ఒత్తిడి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఏకాగ్రత లోపం, చిరాకు, పనులు పూర్తి చేయలేకపోవడం, భావోద్వేగ అస్థిరత, నిద్ర సమస్యలు, అశాంతి వంటి లక్షణాలు కనిపించవచ్చు. చాలామంది వీటిని సాధారణ ఒత్తిడిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. యోగా, వ్యాయామం, సమతుల్య ఆహారం, స్క్రీన్ వినియోగాన్ని తగ్గించడం, అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్