ఏపీ తీరం వెంబడి 'మురసు' తుఫాన్ కదలికలు నమోదయ్యాయి. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల నుండి 5.30 గంటల మధ్య ఒంగోలు సమీపంలో ఈ తుఫాన్ తీరాన్ని దాటినట్లు ఎస్డీఎంఏ (SDMA) అధికారులు వెల్లడించారు. తుఫాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం 9552300009 నంబర్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.