బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీచేసింది. కొన్ని రోజులు చికెన్ తినవద్దని సూచించింది. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు వ్యాపించినందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.