వాట్సాప్ యూజర్లకు కీలక అలర్ట్. సెప్టెంబర్ 8 నుంచి ఆండ్రాయిడ్ 5.0, 5.1 వంటి పాత వెర్షన్లపై పనిచేసే ఫోన్లలో వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇకపై ఆండ్రాయిడ్ 6.0 లేదా అంతకంటే పై వెర్షన్లలో మాత్రమే యాప్ పనిచేస్తుంది. ఈ మార్పు వాట్సాప్ బిజినెస్‌కూ వర్తిస్తుంది. ప్రభావిత యూజర్లు వెంటనే చాట్ డేటాను బ్యాక్‌అప్ చేసుకోవాలని సూచనలు జారీ అయ్యాయి. కాగా, తాజా సెక్యూరిటీ ఫీచర్ల అమలులో ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.