భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి శ్రీవాణి దర్శన సమయాల్లో మార్పులు

తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీవాణి టికెట్లపై TTD మార్పులు చేసింది. శుక్రవారం నుంచి టికెట్ తీసుకున్న రోజే దర్శనం కల్పించనున్నారు. టికెట్లు తీసుకున్న భక్తులకు సాయంత్రం 4:30కి దర్శనానికి అనుమతి ఉంటుంది. అక్టోబర్ నెల ఆన్‌లైన్ టికెట్లు పొందినవారికి ఉదయం 10కి దర్శనం యథాతథంగా ఉంటుంది. నవంబర్ నుంచి అన్ని టికెట్లకు సాయంత్రం 4:30కి మాత్రమే దర్శనం. తిరుమలలో 800, రేణిగుంట ఎయిర్‌పోర్టులో 200 టికెట్లు జారీ అవుతాయి.

సంబంధిత పోస్ట్