బ్యాంక్ అకౌంట్ వాడనివారికి అలర్ట్.. భారీగా జరిమానా!

ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండి వాటిని వినియోగించని వారికి అలర్ట్. ఉద్యోగం మారిన తర్వాత లేదా ఇతర కారణాలతో తెరిచిన శాలరీ ఖాతాల్లో డబ్బులు జమ కాకపోతే అవి సాధారణ సేవింగ్స్ ఖాతాలుగా మారుతాయి. అప్పుడు మినిమం బ్యాలెన్స్ ఉంచకపోతే బ్యాంకులు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరం లేని ఖాతాలను మూసివేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అకౌంట్ క్లోజ్ చేయాలంటే క్లోజర్ ఫారం, ఆధార్, పాన్, పాస్‌బుక్ సమర్పించాలి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 14 రోజుల్లోపు ఖాతా మూసివేస్తే ఛార్జీలు ఉండవు. 15 రోజుల నుంచి ఏడాదిలోపు మూసితే రూ.500తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్