PF అకౌంట్ ఉన్నావారికి ఈపీఎఫ్‌వో నుంచి అలర్ట్.. ఇలా చేయకపోతే సేవలు బంద్

EPFO పీఎఫ్ ఖాతాదారులకు కీలక అలర్ట్ జారీ చేసింది. EPF సేవలను ఆన్‌లైన్‌లో పొందాలంటే తప్పనిసరిగా UAN యాక్టివేషన్ చేయాలని స్పష్టం చేసింది. UAN యాక్టివ్ లేకుంటే వెబ్‌సైట్‌లో ఎలాంటి సేవలు లభ్యం కావని తెలిపింది. కొత్త లేబర్ కోడ్ల ప్రకారం ప్రతి రంగంలో ఉద్యోగులకు పీఎఫ్ సౌకర్యం తప్పనిసరి. గిగ్ వర్కర్లకూ పీఎఫ్ ప్రయోజనాలు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. యూఏఎన్ యాక్టివేషన్ విధానం: EPFO పోర్టల్‌లో Activate UAN ఎంపికపై క్లిక్ చేసి, యూఏఎన్, ఆధార్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ నమోదు OTP ఇస్తే UAN యాక్టివ్ అవుతుంది.

సంబంధిత పోస్ట్