హైదరాబాద్‌లో మందుబాబుల కోసం పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఇటీవల కొందరు స్కూల్ బస్సు డ్రైవర్లు ఉదయమే మద్యం సేవించి వాహనాలు నడిపినట్టు గుర్తించి, 24 గంటలూ తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాత్రివేళల్లో వందల మందిని పోలీసులు పట్టుకుంటున్నారు.