ALERT: ఏపీలో భారీ వర్షాలు

AP: రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అలాగే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో గురువారం పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని  APSDMA వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్